SHLOKA FOR SAFETY FOR WOMEN

SHLOKA FOR  SAFETY FOR WOMEN
స్త్రీల క్షేమం కోసం....

కాలరాత్రి ఉపాసన ఈ తల్లి నవదుర్గ అవతారాలలో ఒక రూపం ఈమె చూడటానికి భయంకరమైన ఆకారంలో ఉంటుంది అయిన ఈమెకు ఉన్న ఇంకో పేరు సర్వ శుభంకారి అంటే అన్ని ఆటంకాలు తొలగించి సకలసుభాలను కలిగించే తల్లి, ఆ తల్లి రాత్రి దేవత చీకటిలో జరిగే తప్పులను అరికడుతుంది, దుష్టులనుండి శరణు వేడిన వారికి రక్షిస్తుంది... సమాజంలో చెడును అరికడుతుంది.. ధ్యాన చక్రంలో ఈమె పేరు భాను చక్రం. ఈమె స్తానం సాహస్త్రరం.. అక్కడ శివుడి తో కలిసి ఉండే రూపం... ఈమె దుర్మార్గులకు శిక్ష వేస్తుంది. స్త్రీ లకు ఎటువంటి హాని కలకూడదు అని ఈ తల్లి మంత్రాన్ని వీలైనన్ని సార్లు ధ్యానం  చేద్దాము.. ఇక్కడ జపం చేయడానికి ముందు చెప్పాల్సిన సంకల్పం ఇస్తున్నాను ఈ సంకల్పం చెప్పుకుని కనీసం ఈ మంత్రాన్ని 108 సార్లు నుండి మీ ఇష్టం ఎంత జపం చేయగలరో అన్ని సార్లు జయము చేయండి... జపం పూర్తి అయ్యాక  సమర్పణ మంత్రం కూడా చదవండి.. ఇంత మంది కలిసి చేసే ప్రార్ధన సమాజానికి మంచి జరిగేలా చేస్తుంది ఆడవాళ్ల పైన దాడులు జరగకుండా ఆగిపోవాలి స్త్రీలు క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకొని ఈ సంకల్పం చెప్పి మొదలు పెట్టండి.. మీరు ఈ ఉద్దేశం తో చేసినా ఈ మంత్రం పదే పదే పలకడం వల్ల ఈ తల్లి సర్వ శుభంకరి కాబట్టి మీకందరికీ మంచి జరుగుతుంది... ఈ 16 వ తేదీ గ్రహణం ఉన్నారోజు ఉజ్జయిని లో  ఆడవాళ్లు క్షేమం కోసం హోమం కూడా జరుగుతుంది . ఈ మంత్రాన్ని రాసుకుని రేపటి నుండి మొదలు పెట్టండి... ఓం శ్రీ మాత్రే నమః.

సంకల్పం :

శ్రీ మాత్రేనమః
మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మిన్ దేసే సమస్త స్త్రీ .శిశు .సంరక్షణార్థం  కాళ రాత్రి దేవత అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం కాళ రాత్రి మంత్ర యధా శక్తి జపం కరిష్యే..

మంత్రం:

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకంటక  భూషణా ।
వర మూర్ధద్వజా కృష్ణా కాలరాత్రిర్భయం కరీ ॥

మంత్ర జపం చేసిన తర్వాత..:

జపసమర్పణ  యేతత్ జపం శ్రీ కాళరాత్రి దుర్గా పాదార్పితం అస్తు..

శ్రీ మాత్రే నమః

Source...Smt.Bhanumathy Akkisetty

Comments